పనాజీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar).. ప్రస్తుతం గోవా జట్టు తరపున తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. తాజాగా జరిగిన కే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ మ్యాచ్‌లో అతను కీలక రోల్ ప్లే చేశాడు. కర్నాటకతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో గోవా జట్టు ఇన్నింగ్స్ 189 రన్స్ తేడాతో కర్నాటకపై విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్ 13 ఓవర్లలో 41 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. కర్నాటక జట్టు 36.5 ఓవర్లలో కేవలం 103 రన్స్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఆ తర్వాత గోవా భారీ స్కోర్ చేసింది. గోవా జట్టు 413 రన్స్ చేసింది. అభినవ్ తేజ్రానా 109, మంథన్ కుటాకర్ 69 రన్స్ చేశారు. 310 రన్స్ వెనుకబడి ఉన్న కర్నాటక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 121 రన్స్ చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో అర్జున్ టెండూల్కర్ 13.3 ఓవర్లలో 46 రన్స్ చేసి 4 వికెట్లు తీసుకున్నాడు.