Arjun Tendulkar : దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడిగా మనందరికీ సుపరిచితుడైన అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో అవకాశాలు రాక.. ఇటు టీమిండియాకు ఆడాలన్న కల కలగానే ఉండిపోగా.. దేశవాళీలో మాత్రం ఒకేజట్టుకు ఆడాలని భావిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం గోవాకు మారిన అర్జున్.. ఇప్పట్లో తనకు జట్టు మారే ఉద్దేశం లేదంటున్నాడు.
కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించనున్నాడు. కొన్నాళ్లుగా గోవాకు ఆడుతున్న అతడు ఈమధ్య ఆ జట్టు ఒమన్ పర్యటనకు దూరమయ్యాడు. దాంతో, టెండూల్కర్ జట్టు మారుతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే.. తాను మాత్రం గోవాకే కట్టుబడి ఉన్నానని చెబుతున్నాడీ పేసర్. 2022-23 సీజన్‌కు ముందు ముంబైను వీడి గోవాకు మారిన అతడు.. మరికొన్ని సీజన్లు జట్టు మారే ఆలోచన చేయడం లేదు. ఇప్పటివరకూ అర్జున్… గోవా తరఫున 50 వికెట్లు తీశాడు.
Arjun Tendulkar Takes Key Career Decision. Report Reveals Major Detailshttps://t.co/RITvCL4tPQ pic.twitter.com/7JE5Wx95jR
— NDTV Sports (@Sports_NDTV) August 21, 2026
ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ అర్జున్ టెండూల్కర్‌ను ట్రేడ్ పద్దతిన తీసుకుంది. ఒక పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడిన అర్జున్ బెంచ్ మీద ఉండడం ఇష్టం లేకనే ముంబైని వదిలేశానని చెప్పాడు. అయితే.. లక్నో జెర్సీతో కూడా అతడి రాత మారలేదు. లీగ్ దశలో చివరి మ్యాచ్‌కు మాత్రమే అర్జున్‌కు అవకాశం దక్కింది.
ఫస్ట్‌క్లాస్ ఎంట్రీకి ముందు అర్జున్ మహారాష్ట్ర, గోవా తరఫున 7 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు మాత్రమే ఆడాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న తన కలను నిజం చేసుకున్నాడు. గోవా జట్టు తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. పొర్వోరిమ్ స్టేడియంలో రాజస్థాన్‌తో ఎలైట్ గ్రూప్ సీ మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తొలి మ్యాచ్ ఆడాడు.