FIDE Chess World Cup : ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) జోరు చూపిస్తున్నాడు. గోవా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు అర్జున్. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ లెవొన్ అరోనియన్‌తో ఐదో రౌండ్ తొలి గేమ్‌ను డ్రాతో ముగించిన అతడు.. శనివారం రెండో రౌండ్లో విజయం సాధించాడు. మరో స్టార్ ప్లేయర్ పెండ్యాల హరికృష్ణ (Pendyala Harikrishna) టైబ్రేక్ ఆడనున్నాడు.
ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న అర్జున్ ఎరిగేసి చెస్ వరల్డ్ కప్‌లో గొప్పగా ఆడుతున్నాడు. ఐదో రౌండ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ లెవొన్ అరోనియన్‌ను నిలువరించాడు. తెలివైన వ్యూహాలతో ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచిన అతడు తొలి గేమ్ డ్రా చేసుకున్నాడు. శనివారం జరిగిన రెండో గేమ్‌లో ఆధిపత్యం చెలాయించిన అర్జున్.. లెవొన్ ఆట కట్టించాడు. సెమీస్ బెర్తు కోసం వీ యీ(చైనా), సామ్యూల్ సెవియన్(అమెరికా) మ్యాచ్ విజేతతో భారత స్టార్ తలపడనున్నాడు.
♟️Indian Grandmaster Arjun Erigaisi storms into quarter-finals of the FIDE Chess World Cup, defeating two-time champion Levon Aronian in Goa. 🇮🇳
Arjun Erigaisi becomes the first Indian player and second overall to qualify for the quarter-finals of the FIDE Chess World Cup 2025.… pic.twitter.com/eXg1PGxqcW
— All India Radio News (@airnewsalerts) November 15, 2025
ఐదో రౌండ్ తొలి మ్యాచ్‌ను పెద్దగా కష్టపడకుండానే డ్రా చేసుకున్నాడు పెండ్యాల హరికృష్ణ. ప్రత్యర్ధి అయిన జోస్ మార్టినేజ్ ఎత్తులను ముందే పసిగట్టిన అతడు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో.. ఇరువురు 41వ ఎత్తులో డ్రాకు అంగీకరించారు. రెండో రౌండ్లోనూ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు ఆడారు. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌ను ముగించేందుకు ఇరువురు ఆదివారం టైబ్రేక్ ఆడనున్నారు. గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, డి.గుకేశ్‌లో నిష్క్రమించినందున.. భారత ఆశలన్నీ అర్జున్, హరికృష్ణ మీదనే ఉన్నాయి.