విజ్క్ ఆన్ జి (నెదర్లాండ్స్): ప్రపంచంలో అత్యంత పురాతన చెస్ టోర్నీగా గుర్తింపు పొందిన టాటా స్టీల్ మాస్టర్స్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి శుభారంభం చేశాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఈ తెలంగాణ కుర్రాడు.. తొలి రౌండ్లో భారత్‌కే చెందిన రమేశ్ ప్రజ్ఞానందపై విజయం సాధించాడు.
మరో మ్యాచ్‌లో వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్.. జవొఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్థాన్)తో జరిగిన తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు.