FIDE Chess World Cup : స్వదేశంలో జరుగుతున్న ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) పతకంపై ఆశలు రేపుతున్నాడు. డి.గుకేశ్, ప్రజ్ఞానంద, పెండ్యాల హరికృష్ణలు నిష్క్రమించినా అతడు మాత్రం పట్టువిడవడం లేదు. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చి క్వార్టర్స్ చేరిన అర్జున్.. క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. వీ యీ(చైనా)తో తలపడిన ఈ యంగ్‌స్టర్ 31వ ఎత్తులో ప్రత్యర్ధిని నిలువరించడంతో మ్యాచ్ డ్రా అయింది.
గోవా వేదికగా జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న అర్జున్ ఎరిగేసి క్వార్టర్స్‌లోనూ తన మార్క్ ఆట ఆడాడు. ఐదో రౌండ్లో లెవొన్ అరోనియను మట్టికరిపించి క్వార్టర్స్ చేరిన వరంగల్ కుర్రాడు సెమీస్ బెర్త్ కోసం పక్కాగా సిద్దమయ్యాడు. చైనా ప్లేయర్ వీ యీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ 27వ మూవ్ నుంచి మ్యాచ్‌ను డ్రా దిశగా నడిపించాడు అర్జున్. దాంతో.. ఫలితం కోసం రేపు మరో మ్యాచ్ ఆడనున్నారిద్దరూ.
Introducing the quarterfinalists of the 2025 FIDE World Cup! 🔥
❗️Only 2 of the top 15 seeds have made it this far… this event has been unpredictable ⚡️#FIDEWorldCup #Goa pic.twitter.com/1BAU6UZpRV
— International Chess Federation (@FIDE_chess) November 17, 2025
🏆The Quarterfinals of the FIDE World Chess Cup 2025 are underway in Goa, India! #worldchesscup2025
♟️Out of 206 players, only eight remained in the competition, and three of them will qualify for the next FIDE Candidates Tournament!
The Quarterfinalists are: GM Arjun Erigaisi… pic.twitter.com/q7mHK3NxBy— European Chess Union (@ECUonline) November 17, 2025
మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల విషయానికొస్తే.. సామ్ శంక్‌లాండ్(అమెరికా), ఆండ్రే ఎసిపెన్కో మ్యాచ్ సైతం డ్రాగా ముగిసింది. సిందరోవ్ జవోఖిర్ జోసె ఎడెరాడో మార్టినెజ్ మ్యాచ్ సైతం 39వ మూవ్ తర్వాత ఫలితం తేలలేదు.