బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్‌పాంథర్స్ అదరగొట్టింది. ఆదివారం మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 51-30 తేడాతో ఘన విజయం సాధించింది. అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగి విజయకేతనాన్ని ఎగురవేసింది. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో వీరవిహారం చేశాడు. పట్నా డిఫెన్స్‌ను తుత్తునియలు చేస్తూ వరుస పాయింట్లు కొల్లగొట్టాడు. దీంతో మ్యాచ్ మొదలైన ఎనిమిదో నిమిషానికే పట్నా తొలిసారి ఆలౌటైంది. ఎక్కడా వెనుకకు తగ్గని జైపూర్ అటు రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లో ఆకట్టుకుంది. కెప్టెన్ దీపక్ హుడా(8), సందీప్ ధల్(5), విశాల్ (5) డిఫెన్స్‌లో రాణించడంతో జైపూర్ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. మరోవైపు పట్నా జట్టులో సచిన్ (7), మోను గోయత్ (7) ఆకట్టుకున్నా జట్టును గెలిపించలేకపోయారు. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 42-24 తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది.