తిరువనంతపురం: ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ లియోనిల్ మెస్సి(Lionel Messi)తో పాటు అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళలో పర్యటించనున్నారు. అక్కడ ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దురహ్మాన్ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఆ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అర్జెంటీనా జట్టు కేరళలో రెండు మ్యాచ్‌లు ఆడనున్నట్లు ఆయన తెలిపారు. కొచ్చి వేదికను ఖరారు చేశారు.
అయితే అర్జెంటీనాతో తలపడే జట్టు కోసం ఇంకా అంచనా వేస్తున్నారు. ఖతార్ లేదా జపాన్‌తో అర్జెంటీనా తలపబడే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో స్పెయిన్‌లో జరిగిన చర్చలు దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏఎఫ్ఏకు చెందిన బృందం త్వరలో కేరళలో పర్యటించనున్నారు. ఆ మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు కేరళ వ్యాపార సంఘాలు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.