కాన్సాస్ సిటీ: ఫిఫా ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్ బెర్తుపై కన్నేసింది. ఆదివారం స్విట్జర్లాండ్‌తో జరిగే క్వార్టర్ఫైనల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన జట్టును వరుసగా రెండోసారి విజేతగా నిలపాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు 1954 తర్వాత తొలిసారి క్వార్టర్స్ చేరిన స్విట్జర్లాండ్ తన చారిత్రాత్మక ప్రస్థానాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ మెగా టోర్నీలో అర్జెంటీనా అజేయంగా నిలిచింది.
గ్రూప్-జె లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు.. నాకౌట్ దశలోనూ పట్టుదల కనబరిచింది. కాబో వెర్డె, ఈజిప్ట్‌పై ఉత్కంఠ విజయాలతో సత్తా చాటాంది. అదే జోరును స్విస్పైనా కొనసాగించాలని చూస్తోంది. ఈ టోర్నీలో 8 గోల్స్ కొట్టిన మెస్సీ సూపర్ ఫామ్ ఆ జట్టుకు కీలకం కానుంది. మరోవైపు అర్జెంటీనాతో పోలిస్తే స్విస్ అంత బలంగా లేదు. ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్లో గట్టెక్కిన ఆ జట్టు.. వరల్డ్ చాంపియన్‌ను ఏమేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం.