ఢిల్లీ : దేశంలో ఫ్రాంచైజీ ఆధారిత క్రీడలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా భారత్‌లో మరో ప్రతిష్టాత్మక లీగ్‌కు తెరలేవనుంది. దేశానికి ఘనమైన వారసత్వం కలిగిన విలువిద్యలో యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు గాను వచ్చే నెల 2 నుంచి ఢిల్లీ వేదికగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మొదలుకానున్నది.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ టోర్నీలో ఆరు జట్లు తలపడబోతున్నాయి. పృథ్విరాజ్ యోధాస్ (ఢిల్లీ), రాజ్పుత్న రాయల్స్ (రాజస్థాన్), చోళ చీఫ్స్ (తమిళనాడు), కాకతీయ నైట్స్ (తెలంగాణ), చేరొ ఆర్చర్స్ (జార్ఖండ్), మైటీ మారాఠా (మహారాష్ట్ర) తొలి ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.