ECB | ఏడాది తర్వాత వన్డేల్లో ఆర్చర్.. భారత్‌తో సిరీస్‌కు ఆ నలుగురిపై వేటు..!
ECB : ఐపీఎల్-19లో, ఆపై స్వదేశంలో న్యూజిలాండ్‌పై చెలరేగిన జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) కష్టానికి ఫలితం దక్కింది. దాదాపు ఏడాది క్రితం చివరి వన్డే ఆడిన ఈ స్పీడ్‌స్టర్ భారతతో సిరీస్‌కు ఎంపికయ్యాడు.
ECB : ఐపీఎల్-19లో, ఆపై స్వదేశంలో న్యూజిలాండ్‌పై చెలరేగిన జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) కష్టానికి ఫలితం దక్కింది. దాదాపు ఏడాది క్రితం చివరి వన్డే ఆడిన ఈ స్పీడ్‌స్టర్ భారతతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. సస్సెక్స్ ఆల్‌రౌండర్ జేమ్స్ కొల్స్ (James Coles) సైతం తొలిసారి వన్డే జెర్సీ వేసుకోనున్నాడు. సొంతగడ్డపై భారత్‌తో మూడు వన్డే సిరీస్‌కు శుక్రవారం ఇంగ్లండ్, వేల్స్ బోర్డు(ECB) ప్రకటించిన స్క్వాడ్‌ను ఆర్చర్, జేమ్స్‌కు చోటు దక్కింది. హ్యారీ బ్రూక్ సారథికి పూర్తి స్థాయిలో వన్డే పగ్గాలు అప్పగిస్తూ 16 మందితో కూడిన బృందాన్ని ఈసీబీ ఎంపిక చేసింది.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న ఇంగ్లండ్ కూర్పుపై దృష్టి సారిస్తోంది. స్వదేశంలో భారత జట్టుతో టీ20 సిరీస్ అనంతరం మొదలయ్యే వన్డే సమరంతోనే స్క్వాడ్‌ను పటిష్టం చేసుకోవాలని భావించిన ఈసీబీ.. శుక్రవారం వన్డే బృందాన్ని ప్రకటించింది ఈసీబీ. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక పర్యటనకు దూరమైన పేసర్లు గస్ అట్కిన్సన్, సకీబ్ మహమూద్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అదే సమయంలో లంక సిరీస్‌లో ఆడిన నలుగురిపై వేటు వేశారు.
16 players for our 3-match ODI series with India!
Click below for the full squad 👇
— England Cricket (@englandcricket) July 3, 2026
శ్రీలంకపై నిరాశపరిచిన ఓపెనర్ జాక్ క్రాలే, పేసర్లు జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, ల్యూక్ వుడ్‌లను తప్పించి.. వీరి స్థానంలో ఆర్చర్, అట్కిన్సన్, సకీబ్, కోల్స్‌ను తీసుకుంది ఈసీబీ. 2027లో దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్‌కప్ లక్ష్యంగా స్క్వాడ్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇక.. భారత్, ఇంగ్లండ్ మధ్య జూలై 14 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలవ్వనుంది. తొలి వన్డే ఎడ్జ్‌బాస్టన్‌లో.. రెండోది కార్డిఫ్‌లో జూలై 16న, మూడోది లార్డ్స్‌లో జూలై19న జరుగున్నాయి.
🚨 BREAKING 🚨
England have announced their squad for the three-match ODI series against India! 🔥🏆#Cricket #ODI #ENGvIND pic.twitter.com/nzL4I3QSlO
— Sportskeeda (@Sportskeeda) July 3, 2026
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : బెన్ డకెట్, జోస్ బట్లర్, జాకబ్ బెథెల్, జో రూట్, టామ్ బ్యాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), విల్ జాక్స్, జేమ్స్ కొలెస్, సామ్ కరన్, లియాం డాసన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆర్చర్, జోష్ టంగ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

