IPL 2025 : ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(0)ను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. తెలివిగా ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేసి.. ఫామ్లో ఉన్న అతడి వికెట్ సాధించాడు ఇంగ్లండ్ పేసర్. కీపర్ జురెల్ అధ్బుతంగా క్యాచ్ అందుకోవడంతో ఆర్చర్ గాల్లోకి ఎగిరి సంబురాలు చేసుకున్నాడు. తుషార్ దేశ్పాండ్ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 3 ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్(7) రాహుల్ త్రిపాఠి(1) లు క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లకు చెన్నై స్కోర్.. 8-1.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నితీశ్ రానా(81 36 బంతులలో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ శతకంతో చెలరేగగా చెన్నై సూపర్ కింగ్స్ ముందు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లపై అర్థ శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రానా శనివారం స్వీప్ షాట్లతో రెచ్చిపోయాడు. స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. సంజూ శాంసన్(20)తో 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడీ లెఫ్ట్ హ్యాండర్. మిడిలార్డర్ విఫలమైనా.. కెప్టెన్ రియాన్ పరాగ్(37) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో షిమ్రన్ హిట్మైర్(19) మెరుపులతో ప్రత్యర్థికి రాజస్థాన్ 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.