Virushka | టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా.. నామమాత్రపు మూడో వన్డే ఈనెల 15న (ఆదివారం) తిరువనంతపురంలో జరగనుంది. దీంతో మ్యాచ్‌కు కాస్త సమయం ఉండటంతో విరాట్.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. భార్య అనుష్క శర్మతో కలిసి బీచ్ డేట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను శనివారం ఉదయం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.
కాగా, అనుష్క, విరాట్ 2017లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకి 2021 జనవరిలో కుమార్తె వామిక పుట్టింది. ఇటీవల వామిక రెండో పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా విరుష్క తమ ముద్దుల కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.