Pairs Olympics | ఒలింపిక్స్‌కు అనుష్.. చరిత్ర సృష్టించేనా..?
Pairs Olympics : ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో మెరిసిన అనుష్ అగర్వల్లా (Anush Agarwalla) ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు పట్టేశాడు. తొలిసారి విశ్వక్రీడల్లో సత్తా చాటే చాన్స్ కొట్టేశాడు.
Pairs Olympics : ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో మెరిసిన అనుష్ అగర్వల్లా (Anush Agarwalla) ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు పట్టేశాడు. తొలిసారి విశ్వక్రీడల్లో సత్తా చాటే చాన్స్ కొట్టేశాడు. తోటి పోటీదారు శృతి వొరా (Shruti Vora)ను వెనక్కి నెట్టి ప్యారిస్ టోర్నీకి అర్హత సాధించాడు. ఒలింపిక్స్ పోటీలకు అనుష్ ఎంపికయ్యాడని గురువారం భారత ఈక్వెస్ట్రియన్ సమాఖ్య తెలిపింది.
డ్రెస్సేజ్(Dressage) విభాగంలో అనుష్ బరిలోకి దిగుతాడని ఈఎఫ్ఐ వెల్లడించింది. గత ఏడాది నుంచి డ్రెస్సేజ్ ఈవెంట్లో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. నాలుగు సార్లు నిర్వహించిన కనీస అర్హత ప్రమాణాల్లోనూ అనిష్ సత్తా చాటాడు. ఈ పోటీల్లో 24 ఏండ్ల ఈ కుర్రాడు గుర్రాన్ని నేర్పుగా అదిలిస్తూ 67.695 శాతం మార్కులు సాధించాడు. అతడికి గట్టి పోటీనిచ్చిన శృతి 67.163 శాతానికే పరిమితమైంది.
Only 3️⃣0️⃣ days to go for the biggest sports extravaganza 🏇🥳
Bring it on 🙌#EquestrianDressage #Equestrian#EquestrianFederationOfIndia #IndianEquestrian pic.twitter.com/0gSbesuPgo
— Equestrian Federation Of India (@Efi_India) June 26, 2024
‘ఈఎఫ్ఐ ప్రమాణాల ప్రకారం గుర్రపు స్వారీ చేసే వ్యక్తి కనీసం రెండుసార్లు 67 శాతం మార్కులు సాధించాలి. నాలుగు ఈవెంట్లలో సగటున అత్యధిక యావరేజ్ వచ్చిన వాళ్లను ఒలింపిక్స్ పోటీలకు ఎంపికవుతారు’ అని ఈఎఫ్ఐ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
🏆🇮🇳 Historic Achievement Alert! 🇮🇳🏆#ShrutiVora has rewritten history by becoming the first Indian to win a 3* Grand Prix event in Lipica, Slovenia with a scoreline of 67.761 points🐴✨#ShrutiVora #IndianEquestrian #GrandPrixWinner #HistoryMade pic.twitter.com/NMLF4XmuYW
— Equestrian Federation Of India (@Efi_India) June 13, 2024
ఇరవై ఏండ్ల తర్వాత..
అనుష్ కంటే ముందు ఇద్దరు భారతీయులు ఈక్వెస్ట్రియన్‌లో విభాగంలో ఒలింపిక్స్ బరిలో నిలిచారు. 2000లో ఇంతియాజ్ అనీస్ సిడ్నీలో జరిగిన విశ్వ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏండ్లకు ఫవాద్ మిర్జా టోక్యో ఒలింపిక్స్(2020)లో పోటీపడ్డాడు.
ఇవి కూడా చదవండి
- BJP Expels Leader | బాలికపై హత్యాచారం కేసులో బీజేపీ నేత అరెస్ట్.. పార్టీ నుంచి బహిష్కరణ
- Coolie | తలైవర్‌తో లోకేష్ మిర్రర్ సెల్ఫీ.. ‘కూలీ’ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.!
- Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు.. జూలై 2న హాజరుకావాలని ఆదేశం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

