BJP Expels Leader | బాలికపై హత్యాచారం కేసులో బీజేపీ నేత అరెస్ట్.. పార్టీ నుంచి బహిష్కరణ
BJP Expels Leader | బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. బీసీ కమిషన్లో నామినేటెడ్ సభ్యుడైన అతడ్ని ఆ పదవి నుంచి కూడా తొలగించారు.
డెహ్రాడూన్: బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. (BJP Expels Leader) బీసీ కమిషన్లో నామినేటెడ్ సభ్యుడైన అతడ్ని ఆ పదవి నుంచి కూడా తొలగించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఈ సంఘటన జరిగింది. మూడు రోజుల కిందట 13 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
కాగా, కుమార్తె మొబైల్ ఫోన్కు కాల్ చేయగా బీజేపీ నేత ఆదిత్య రాజ్ సైనీ మాట్లాడినట్లు బాలిక తల్లి ఆరోపించింది. ఆమె తన వద్ద ఉన్నట్లు అతడు చెప్పాడని, ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని తెలిపింది. మరునాడు ఆదిత్య రాజ్ సైనీ ఇంటికి వెళ్లగా తన కుమార్తె కనిపించలేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న తనను చంపుతానని బీజేపీ నేత బెదిరించినట్లు బాలిక తల్లి ఆరోపించింది.
మరోవైపు బహద్రాబాద్ ప్రాంతంలో పతంజలి రీసెర్చ్ సెంటర్ సమీపంలోని హైవే పక్కన బాలిక మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఆదిత్య రాజ్ సైనీ, అతడి అనుచరుడు అమిత్ సైనీ తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, దర్యాప్తు కోసం ఐదు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు బీజేపీ నేత ఆదిత్య రాజ్ సైనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

