Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు.. జూలై 2న హాజరుకావాలని ఆదేశం
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసు నమోదైంది.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో జూలై 2న తమ ఎదుట హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీని కోరింది. కేసు తదుపరి విచారణ జూలై 2న జరుగనున్నది. సుల్తాన్పూర్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్, బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆగస్టు 4, 2018లో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేశారు. జూలై 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
2018తో పాటు గతేడాది నవంబర్ 27న కోర్టు కాంగ్రెస్ నేతను విచారణకు పిలిచింది. ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్‌ను పొందారు. అయితే, అప్పటి నుంచి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నది. అయితే, ఈ నెల 7న కొత్వాలి నగర్‌కు చెందిన రామ్ ప్రతాప్ అనే వ్యక్తి ఈ కేసులో తనను పార్టీగా మార్చాలని కోర్టును కోరారు. అయితే, దీన్ని బీజేపీ నేత విజయ్ మిశ్రా తరఫు న్యాయవాది సంతోష్ పాండే వ్యతిరేకించారు. కేసును జాప్యం చేసేందుకు పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించారు. అయితే, పిటిషన్ కోర్టు తిరస్కరించింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రాహుల్ గాంధీకి సమన్లు పంపాలని కోర్టు ఆదేశించింది. విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేసింది.
Read More
Viral Video | వర్షంలో తడుస్తూ యువతీ రీల్స్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే..?
New Criminal Laws | జూలై ఒకటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సన్నాహాలు..!
Caste Based Census | దేశ వ్యాప్తంగా కుల ఆధారిత జన గణన చేపట్టాలి.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు.. జూలై 2న హాజరుకావాలని ఆదేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

