Sunita Kejriwal | ఎమర్జెన్సీని తలపిస్తోన్న మోదీ సర్కార్ : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై సునీతా కేజ్రీవాల్
Sunita Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు.
Sunita Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యవస్ధలన్నింటినీ ప్రయోగిస్తోందని ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆమె ఆరోపించారు.
కేజ్రీవాల్‌కు జూన్ 20న బెయిల్ లభించగా, వెంటనే ఈడీ స్టే ఉత్తర్వులు తీసుకుంది..ఆ మరుసటి రోజే సీబీఐ ఆయనపై అభియోగాలు మోపింది ఇవాళ ఆయనను అరెస్ట్ చేశారని సునీతా కేజ్రీవాల్ వివరించారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా వ్యవస్ధలన్నింటినీ కేంద్రం ప్రయోగిస్తోందని ఆమె మండిపడ్డారు.
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం కేజ్రీవాల్‌ను కోర్టు రూం నుంచే అరెస్ట్ చేసింది. కోర్టు రూంలో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ కోర్టు వెకేషన్ జడ్జి సీబీఐని అనుమతించారు. మరోవైపు ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు అయిన సందర్భంగా ఎన్డీయే సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేపట్టారు.
ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లా ఎమర్జెన్సీని ఖండించారు. అప్పట్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా రెండు నిమిషాల పాటు సభలో మౌనం పాటించారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

