హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణలో మరో యువ ఆర్చరీ క్రీడాకారిణి జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నది. కొండాపూర్‌లోని మహర్షి విద్యామందిర్‌లో పదో తరగతి చదువుతున్న జోషిత వీరవల్లి.. ఇటీవల రాంచీలో ముగిసిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్ (అండర్-17) పోటీల్లో ప్రతిభ చాటింది.
ఈనెల 10న ముగిసిన పోటీల్లో సీబీఎస్ఈ నేషనల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణంతో పాటు రజతం గెలిచి సత్తాచాటింది.