పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) ఆర్చరీలో.. భారత బృందం అద్భుత ప్రదర్శన ఇచ్చింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అంకిత భక్త్, ధీరజ్ బొమ్మదేవర.. ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇండోనేషియా బృందంపై 5-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్లోకి ప్రవేశించారు. దయానంద చోయిరునిసా-ఆరిఫ్ పంగేస్తు జోడిపై గెలుపొందారు. భారత ఆర్చర్లు ధీరజ్, అంకితలు.. వరుసగా 9,10 పాయింట్లు షాట్ చేశారు. అంకిత మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. చివరి మూడు ప్రయత్నాల్లో ఆమె 10 పాయింట్లు స్కోర్ చేసింది. దీంతో భారత మిక్స్డ్ ఈమ్.. క్వార్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది.
Mostly they will Face China 🇨🇳 in QF and if won Korea 🇰🇷 in Semi Finals
Tough matches await them, All the best to both !! https://t.co/0937mztnX4
— The Khel India (@TheKhelIndia) August 2, 2024