కోల్‌కతా : ముంబైతో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్స్ పోరులో హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (136) శతకంతో మెరిశాడు. అంకిత్‌కు తోడు యశ్వర్ధన్ (36), లక్ష్య (34) రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 263/5 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ముంబై.. కొటియాన్ (97), ములాని (91) పోరాటంతో 315 పరుగులకు ఆలౌట్ అయింది. తమిళనాడు, విదర్భ మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో తమిళనాడు కష్టాల్లో చిక్కుకుంది. రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు.. ఆట ముగిసే సమయానికి 159/6 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు ఇంకా 194 పరుగులు వెనుకంజలో ఉంది. విదర్భ బౌలర్ ఆదిత్య థాక్రే (4/18) ధాటికి తమిళనాడు టాపార్డర్ కుప్పకూలింది.