చాంగ్వాన్: భారత యువ షూటర్లు అనీశ్ భన్వాల్-రిథమ్ సాంగ్వాన్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో కాంస్య పతకం చేజిక్కించుకున్నారు. మంగళవారం జరిగిన 25 ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనీశ్-రిథమ్ జంట 16-12తో చెక్ రిపబ్లిక్ ద్వయంపై విజయం సాధించింది. ఈ ఇద్దరికీ ప్రపంచకప్లో ఇది రెండో పతకం.