కొలంబో: శ్రీలంక మాజీ సారథి, ఆల్రౌండర్ ఏంజెలొ మాథ్యూస్ టెస్టులకు వీడ్కోలు పలుకనున్నాడు. వచ్చే నెల 17 నుంచి గాలె వేదికగా బంగ్లాదేశ్తో జరుగబోయే తొలి టెస్టు తనకు ఆఖరిదని మాథ్యూస్ తాజాగా ప్రకటించాడు. 2009 జులైలో మాథ్యూస్ ఇదే వేదికపై తన టెస్టు కెరీర్ను ఆరంభించాడు.
ఇప్పటిదాకా 118 టెస్టులలో మాథ్యూస్ 44.62 సగటుతో 8,167 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 45 అర్ధ శతకాలున్నాయి. టెస్టులలో లంక తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో సంగక్కర (12,400), జయవర్దెనే (11,814) తర్వాతి స్థానం మాథ్యూస్దే.