న్యూఢిల్లీ: మెల్బోర్న్ టెస్టులో మెరుపులు మెరిపించిన యువ క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అదిరిపోయే నజరానా ప్రకటించింది. ఆసీస్‌పై అద్భుత ప్రదర్శన కనబరుస్తూ టెస్టుల్లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్న నితీశ్‌కు రూ.25లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించింది.
టీమ్ఇండియా తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన నితీశ్‌కు ఏసీఏ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. మరోవైపు ఆసీస్‌ను దీటుగా ఎదుర్కొంటూ నితీశ్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడంటూ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు.