దుబాయ్: ఇటీవలే ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులకు వేదికైన పిచ్‌లకు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. తొలి టెస్టు జరిగిన హెడింగ్లీ (లీడ్స్) పిచ్ మినహా మిగిలిన పిచ్‌లు ఐసీసీ స్టాండర్డ్స్‌ను అందుకోవడంలో విఫలమయ్యాయి.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన పిచ్ రేటింగ్‌లో లీడ్స్ ఒక్కటే ‘చాలా బాగుంది’ (వెరీ గుడ్) రేటింగ్ దక్కించుకోగా రెండో టెస్టు జరిగిన బర్మింగ్‌హామ్, మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన లార్డ్స్ సహా నాలుగో టెస్టుకు వేదికైన మాంచెస్టర్ పిచ్‌లు ‘సంతోషకరం’ (సాటిసిఫాక్టరీ)తో సరిపెట్టుకున్నాయి. ఇంగ్లండ్‌లో నిర్జీవమైన పిచ్‌లపై బౌలర్లు చెమటోడ్చగా బ్యాటర్లు పరుగుల వరద పారించిన విషయం విదితమే. ఓవల్ పిచ్‌కు ఇంకా రేటింగ్ ఇవ్వాల్సి ఉంది.