హెడింగ్లీ: ఇంగ్లండ్తో ప్రారంభమైన మూడో టెస్ట్ తొలి రోజు తొలి సెషన్లోనే టీమిండియా( Ind vs Eng ) పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ టీమ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చెలరేగడంతో 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0), పుజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (7) దారుణంగా విఫలమయ్యారు. ఈ మూడు వికెట్లూ ఆండర్సన్ ఖాతలోకే వెళ్లాయి. అతడు ఆరు ఓవర్లలో ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.