Viswanathan Anand : ఒకప్పుడు చదరంగంలో రారాజుగా వెలుగొందిన విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand) మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నాడు. ఆరేళ్ల విరామం తర్వాత తొలి గేమ్‌తో అభిమానులను అలరించనున్నాడీ చెస్ దిగ్గజం. టాటా స్టీల్ చెస్ ఇండియా ( TATA Steel Chess India -2025) టోర్నీలో తన శిష్యుడైన డి.గుకేశ్(D Gukesh)తో ఆడనున్నాడు విషీ. వచ్చే ఏడాది జనవరిలో సొంతగడ్డపై జరుగబోయే ఈ మెగా ఈవెంట్లో వీరిద్దరి పోరుపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019 తర్వాత ఆనంద్ బరిలోకి దిగుతుండడంతో అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి.
వచ్చే ఏడాది ఆరంభంలో బెంగాల్‌లోని ధోనో ధ్యానో ఆడిటోరియంలో టాటా స్టీల్ చెస్ ఇండియా 2025 టోర్నీ జరుగనుంది. ఆనంద్ గుకేశ్‌తో పాటు పలువురు అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్లు పోటీపడనున్నారు. అయితే.. ఆరేళ్ల బ్రేక్ తర్వాత ఆనంద్ ఆడుతున్న మ్యాచ్‌పైనే అందరూ ఆసక్తిగా ఉన్నారు. ‘స్వదేశంలో జరుగబోయే ఈ మెగా టోర్నీలో యువకెరటంతో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అని ఆనంద్ మీడియాతో’ అన్నాడు.
You guessed it right!!
Viswanathan Anand is coming to play at the Tata Steel Chess India 2026 after 6 years. #viswanathananand #worldchampion #tatasteelchessindia #tscikolkata #chesschampion #indianchess #chessinkolkata #chesstournament2026 #grandmasterlife #tsci2026 pic.twitter.com/gVToxGxDxy
— Tata Steel Chess India (@tschessindia) December 17, 2025
స్టీల్ చెస్ ఇండియా టోర్నీలో.. ఓపెన్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల విభాగంలో పోటీలు జరుగనున్నందున.. రెండు కేటగిరీల విజేతలకు సమానమైన ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. భారత్ నుంచి ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగేసి, విదిత్ గుజరాతీ, అరవింద్ చిదంబరం, దివ్య దేశ్‌ముఖ్, డి.హారిక, ఆర్ వైశాలి. వంతికా అగర్వాల్, రక్షిత రవిలు పోటీకి సిద్ధమవుతున్నారు. విదేశీయుల్లో వీ యీ, వెస్లీ సో, హన్స్ నీమన్, వొలొదర్ ముర్జిన్, అలెగ్జాండ్రా గొర్యచ్కినా, కేథిరినా లగ్నో, ననా జగ్నిడ్జేలు ఉన్నారు.