Anahat Singh : భారత యువకెరటం అనహత్ సింగ్(Anahat Singh) మరో సంచలనం సృష్టించింది. ఈమధ్యే 19వ ఆసియా గేమ్స్(Asia Games 2023)లో పతకంతో వార్తల్లో నిలిచిన ఆమె అండర్-19 అమ్మాయిల జూనియర్ ఓపెన్ స్క్వాష్(Scotish Juior Open Squash) పోటీల్లో విజేతగా అవతరించింది. స్కాంట్లాండ్ వేదికగా జరిగిన ఆదివారం జరిగిన ఫైనల్లో అనహత్ తన ఫేవరేట్ రాబిన్ మెక్అల్పైన్(Robin McAlpine)ను మట్టికరిపించింది.
తొలి సెట్ నుంచి ఆధిపత్యం చెలాయించిన అనహత్ 11-6, 11-1, 11-5తో విజయం సాధించింది. ఆసియా గేమ్స్‌తో పాటు ఆసియా మిక్సడ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన అనహత్ 2023 ఏడాదిని విజయంతో ముగించడం విశేషం.
అండర్- 13 ఫైనల్లో టాప్ సీడ్ ఆద్యా బుదియా(Aadya Budhiya) మలేషియాకు చెందిన నీహియా చ్యూపై గెలుపొందింది. ఇక అబ్బాయిల విషయానికొస్తే.. అండర్ -15లో సుభాష్ చౌదరీ 5-11, 11-4, 6-11, 11-8, 11-5తో భారత్‌కే చెందిన శివేన్ అగర్వాల్‌ను ఓడించాడు. అండర్ -13 ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ 11-8, 11-8, 3-11, 11-8తో శ్రేయాన్షు జయ్‌ను చిత్తు చేశాడు.