హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న (Drugs Suppliers) ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నిస్తున్నది. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్, రూ.10 వేలు, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు.
బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ విక్రయదారులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు గతవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల వద్ద రూ.3 లక్షల విలువజేసే 30 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.