టొరంటో(కెనడా) : భారత స్కాష్ సంచలనం అన్హత సింగ్ మరో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ ఏడో ర్యాంకర్‌కు షాకిచ్చింది. టొరంటోలో జరుగుతున్న కెనడా ఓపెన్ మహిళల క్వార్టర్స్‌లో 17 ఏండ్ల అన్హత్.. 3-0 (12-10, 11-9, 11-9)తో ప్రపంచ ఏడో ర్యాంకర్ అయిన రెండో సీడ్ టిన్నె గిలిస్ను ఓడించి సెమీస్ చేరింది.
టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఈ ఢిల్లీ అమ్మాయి.. 36 నిమిషాల్లోనే పోరును ఏకపక్షంగా మార్చేసి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదుచేసింది.