హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ గోల్ఫ్ హబ్‌గా మారుతున్నది. ప్రతిష్టాత్మక గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ 2025 మొదటిసారి దక్షిణభారత్ వేదికగా జరుగబోతున్నది. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్ గోల్ఫ్ క్లబ్లో రెండు రోజుల పాటు ఈ సెమినార్ జరుగనుంది. ఇందులో టర్ఫ్ మేనేజ్మెంట్, ప్లేయర్స్‌తో పాటు గోల్ఫ్ అసోసియేషన్‌కు చెందిన ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఈ భేటీలో పాల్గొననున్నారు.
దేశ వ్యాప్తంగా గోల్ఫ్‌ను ప్రమోట్ చేయడంతో పాటు గోల్ఫ్ కోర్సుల నిర్మాణ, యువ గోల్ఫర్లకు అత్యుత్తమ శిక్షణ, ఇతర అంశాలపై చర్చిస్తారు. ఈ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ గోల్ఫ్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుందని జీఐఏ చైర్మన్ అనిరుధ్ అన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సమ్మిట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి పేర్కొన్నారు.