కుచింగ్ (మలేషియా): ఏషియన్ స్కాష్ డబుల్స్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. మలేషియాలోని కుచిం గ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో టాప్ సీడ్ అన్హత్ సింగ్-అభయ్ సింగ్ ద్వయం.. మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్ చేరారు.
సెమీస్‌లో ఈ జోడీ.. 2-1 (11-8, 10-11, 11-5)తో మలేషియా ద్వయం అమని-కమల్‌ను చిత్తుచేసింది. మహిళల డబుల్స్‌లో అన్హత్-చిన్న ప్ప.. 2-0 (11-7, 11-6)తో సెమీస్‌లో హాంకాంగ్‌కు చెందిన క్రిస్టి వొంగ్-టొబి సియిను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో అభయ్-సెంథిల్ కుమార్.. ఫైనల్ చేరారు.