ముంబై: భారత యువ స్కాష్ ప్లేయర్లు అభయ్ సింగ్, అనాహత్ సింగ్ జేఎస్‌డబ్ల్యూ ఇండియా ఓపెన్ 2026 స్కాష్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఆదివారం రాత్రి ముంబైలో ముగిసిన ఫైనల్స్‌లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించి విజేతలుగా నిలిచారు.
పురుషుల సింగిల్స్‌లో అభయ్.. 3-0 (11-9, 11-8, 11-4)తో సహచర భారత ఆటగాడు వీర్ చొత్రానిపై ఏకపక్ష విజయంతో టైటిల్ సాధించాడు. ఇక మహిళల సింగిల్స్‌లో యువ సంచలనం అనాహత్.. 3-1 (11-5, 11-6, 9-11, 11-6)తో హనా మోతాజ్ (ఈజిప్ట్)ను చిత్తుచేసింది.