Amol Muzumdar : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) పై ప్రశంసలు కురుస్తున్నాయి. గుజరాత్ టైటన్స్(Gujarat Titans)పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అతను అర్ధ శతకంతో జట్టు విజయానికి బాటలు వేశాడు. దాంతో, ఈ పవర్ హిట్టర్‌ను భారత జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్(ODI WC) జట్టులో శాంసన్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. ‘శాంసన్ తన పవర్ హిట్టింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అతను కొన్ని సిరీస్‌లలో విఫలయమ్యాడు. కానీ, అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉంది’ అని మజుందార్ చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఆక్టోబర్ – నవంబర్ మధ్యలో ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. దాంతో, స్వదేశంలో కప్పు కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటికే బీసీసీఐ 21 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసింది.
Rr F
కెప్టెన్‌గా శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను సమర్థంగా నడిపిస్తున్నాడు. గత సీజన్లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 16వ సీజన్లోనూ అతను అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హాఫ్ సెంచరీ కొట్టాడు. గుజరాత్ టైటన్స్‌తో 4 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో సంజూ క్రీజులోకి వచ్చాడు. కుదరుకున్నాక సిక్సర్ల మోత మోగించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. 60 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశాడు. ఆ తర్వాత షిమ్రన్ హిట్మెయిర్(56) ఆఖరి దాకా నిలిచి రాజస్థాన్‌ను గెలిపించాడు.