హైదరాబాద్, ఆట ప్రతినిధి : బరోడా వికెట్ కీపర్ బ్యాటర్ అమిత్ పాసి తాను ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలుకొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాసి (55 బంతుల్లో 114, 10 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీ కొట్టి ఈ ఫార్మాట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ (2015లో సియాల్కోట్ స్టాలియన్స్ తరఫున 48 బంతుల్లో 114) పేరిట ఉండేది. ఇక ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గానూ అతడు రికార్డు సృష్టించాడు. పాసి మెరుపులతో బరోడా.. సర్వీసెస్‌పై 13 పరుగుల తేడాతో గెలిచింది.