సెయింట్ కిట్స్: అరంగేట్రం చేసిన వన్డేల్లోనే సెంచరీ కొట్టేశాడు విండీస్ బ్యాటర్ ఆమిర్ జంగూ(Amir Jangoo). సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 83 బంతుల్లో 104 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మూడవ వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది వెస్టిండీస్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 321 రన్స్ చేసింది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్ 73, హసన్ మీర్జా 77, మొహమదుల్లా 84, జాకిర్ అలీ 62 రన్స్ చేశారు. ఆ తర్వాత భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన వెస్టిండీస్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నది. విండీస్ బ్యాటర్లలో కీసీ కార్టీ 95, ఆమిర్ జంగూ 104, గుదకేశ్ మోటి 44 రన్స్ చేశారు.
46 ఏళ్ల తర్వాత అరంగేట్రం వన్డేలో సెంచరీ చేసిన విండీస్ క్రికెటర్‌గా జంగూ నిలిచాడు. గతంలో డెస్మండ్ హేన్స్ ఆ రికార్డు క్రియేట్ చేశాడు. 1978 ఫిబ్రవరిలో హేన్స్ 136 బంతుల్లో 148 రన్స్ చేశాడు. జంగూ తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లు బాదాడు. 86 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో కార్టీతో జతకలిసిన జంగూ అయిదో వికెట్‌కు 132 రన్స్ జోడించారు. ఆదివారం నుంచి రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది. ఫస్ట్ మ్యాచ్ సెయింట్ విన్సెంట్‌లో జరగనున్నది.
A stunning debut hundred from Amir Jangoo lifts the West Indies to a 3-0 ODI series clean sweep 🙌#WIvBAN 📝 https://t.co/HjIHFsVck5 pic.twitter.com/JFLJZf0y3B
— ICC (@ICC) December 12, 2024