Shubman Gill – Sara Tendulkar: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ గత కొంతకాలంగా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా దానికి మరో ఆధారం దొరికింది. ముంబైలో శనివారం రాత్రి సారా టెండూల్కర్‌తో గిల్ సోదరి షెహనాజ్ గిల్లు కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. సారా – గిల్లు ఇద్దరూ తమ ప్రేమను అటు సోషల్ మీడియాలో గానీ ఇటు బహిరంగంగా గానీ ప్రకటించలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఇద్దరూ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. మధ్యలో కొన్నిరోజుల పాటు ఈ జోడీ మధ్య మనస్పర్థలు వచ్చినా ఇప్పుడవన్నీ సర్దుకున్నాయని, తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి గిల్ సోదరి అస్త్రాన్ని ప్రయోగించాడని నెట్టింట జనం చెవులు కొరుక్కుంటున్నారు.
2021 నుంచి 2022 దాకా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరి పోస్టులను ఒకరు లైక్ చేసుకోవడం, లేట్ నైట్ డిన్నర్లతో వార్తల్లో నిలిచారు. కానీ ఆ ఏడాది ఏమైందో ఏమో గానీ ఈ ఇద్దరి మధ్య చెడిందన్న వార్తలు వినిపించాయి. కానీ గతేడాది వీరిద్దరి మధ్య ప్రేమ మళ్లీ చిగురించిందని రూమర్స్ వచ్చాయి. అందుకు అనుగుణంగానే వన్డే వరల్డ్ కప్‌లో ముంబై, పూణెలలో భారత్ ఆడిన మ్యాచ్‌లకు గిల్ బ్యాటింగ్‌కు రాగానే స్టాండ్స్‌లో ఉన్న సారా అతడికి మద్దతుగా చప్పట్లు కొట్టడంతో కెమెరాలన్నీ ఆమెను ఫోకస్ చేశాయి. ఇక గిల్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ‘గిల్ భాయ్.. సారా బాబీ ఉంది చూడు’ అని అరవడం వంటివి అప్పట్లో వైరల్ అయ్యాయి.
Sara and Shubman’s sister Shahneel tonight 🥰💓 #SaraTendulkar #ShubmanGill pic.twitter.com/fv37iCNXKa
— T (@Gladlyel) January 20, 2024
తాజాగా శనివారం రాత్రి ఈ ఇద్దరూ ఒకే కార్లో కనిపించడంతో గిల్ తన లవ్ స్టోరీని స్ట్రాంగ్ చేసుకోవడంతో పాటు సారాకు మరింత దగ్గరవడానికి యత్నిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు అఫ్గాన్‌తో సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్ ఆడి విఫలమైన గిల్.. త్వరలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగాల్సి ఉన్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు.