ఓహియో: అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో దురదృష్టకర ఘటన చోటుచేసుకున్నది. బఫెలో బిల్స్ జట్టుకు చెందిన స్టార్ ఆటగాడు డామర్ హమ్లిన్.. ప్రత్యర్థి ప్లేయర్ బలంగా ఢీకొనడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు. 24 ఏళ్ల హమ్లిన్కు గుండెపోటు వచ్చినట్లు తేలింది. సిన్సినాటి బెంగాల్స్ జట్టుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సుమారు 30 నిమిషాల పాటు మైదానంలోనే హమ్లిన్కు సీపీఆర్ చేశారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడు ఢీకొనడంతో హమ్లిన్ కిందపడ్డాడు. ఆ తర్వాత అతను లేచి నిలుచున్నాడు. ఆ వెంటనే మళ్లీ వెనక్కి కుప్పకూలాడు. అంబులెన్స్‌లో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. ఎన్ఎఫ్ఎల్ మ్యాచ్‌ను రద్దు చేశారు.