ముంబై : వెస్టిండీస్ వేదికగా 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా టైటిల్ గెలువడంలో సూర్యకుమార్‌యాదవ్ క్యాచ్ హైలెట్. గెలుపుపై ఆశలు వదులుకున్న వేళ.. హార్దిక్‌పాండ్యా బౌలింగ్‌లో మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గర సూర్య పట్టుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఓటమి ఖాయమనుకున్న క్రమంలో సూర్య సూపర్ క్యాచ్‌తో భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది. అయితే సూర్య సంచలన క్యాచ్‌పై అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మెగాటోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాయుడు ‘అన్ఫిల్టర్డ్ పాడ్‌కాస్ట్’లో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. ‘ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కొంత మంది వ్యాఖ్యాతలు మైదానంలో మాట్లాడుతున్నారు. బ్రాడ్కాస్టర్ల సౌలభ్యం కోసం చైర్‌పై స్కీన్‌పై ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బౌండరీలైన్ కొద్దిగా జరిగింది. బ్రేక్ తర్వాత కూడా అదే అలాగే యధాస్థానంలోనే ఉంది. దీంతో బౌండరీలైన్ కొద్దిగా పెద్దగా మారింది. సూర్య క్యాచ్ పట్టే సమయానికి మేము పై నుంచి గమనిస్తూనే ఉన్నాం. మిల్లర్ కొట్టడం సూర్య క్యాచ్ అందుకోవడం అంతా జరిగిపోయింది. ఇదంతా దేవుడి ప్లాన్ అని అనుకున్నాను’ అని అన్నాడు.
కోహ్లీ ప్రభావం 100 ఏండ్ల ఆధిపత్యం : విరాట్ కోహ్లీ..చూపించిన ప్రభావం మరో 100 ఏండ్లు భారత క్రికెట్ ఆధిపత్యం చెలాయించేందుకు పనిచేస్తుందని రాయు డు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక భారత క్రికెట్‌పై కోహ్లీ చూపించిన ఎఫెక్ట్ మరే ఏ క్రికెటర్‌కు సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. ‘దేశం క్రికెట్‌పై కోహ్లీ ప్రభావం వెలకట్టలేనిది. కేవలం అతని బ్యాటింగ్ వరకే పరిమితం కాదు. ఫిట్నెస్ ద్వారా జట్టులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. కోహ్లీ ముందు వరకు అందరూ సహజ ఫిట్నెస్తో కనిపించే వారు. కానీ అతని ఎంట్రీ తర్వాత టీమ్‌లో ఫిట్నెస్ స్థాయి పెరిగిపోయింది. అతని ఇచ్చిన ప్రభావంతో మరో 100 ఏండ్లు భారత క్రికెట్ ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. టీమ్ఇండియాకు మరిన్ని టెస్టులు ఆడాల్సింది’ అని అన్నాడు.