Ambati Rayudu : టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) మరో అంతర్జాతీయ లీగ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఐఎల్ టీ20 రెండో ఎడిషన్‌లో ఎంఐ ఎమిరేట్స్ (MI Emirates) జట్టుకు రాయుడు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ స్టార్ క్రికెటర్ తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది.
బ్లూ అండ్ గోల్డ్ (జట్టు జెర్సీ కలర్) తరఫున అంబటి రాయుడు కొత్త అధ్యయాన్ని లిఖించబోతున్నాడని పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ముగిసిన తర్వాత రాయుడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతడు కరీబియన్ లీగ్(CPL)లో సెయింట్స్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్(St Kitts & Nevis Patriots)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 13న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 రెండో సీజన్ మొదల్వనుంది.
This iconic story was never over 📽️
Ambati Rayudu is ready to write yet another illustrious chapter in blue & gold 💙✍️#OneFamily #MIEmirates pic.twitter.com/n5hmLmBTQn
— MI Emirates (@MIEmirates) August 21, 2023
రెండో సీజన్ కోసం ఎమిరేట్స్ ఫ్రాంచైజీ ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్లు ఎవరంటే..? కుశాల్ పెరీరా, అకీల్ హొసైన్, విజయకాంత్ వియస్కాంత్, కోరే అండర్సన్, వకార్ సలామ్‌ఖీల్, ఒడియన్ స్మిత్, నోస్తుష్ కెంజిగె. వీళ్లలో నలుగురు గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2010-2017 మధ్య రాయుడు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించగా, కోరే అండర్సన్ 2014 నుంచి 2016 వరకు ఎంఐకి ఆడాడు. వకార్ సలామ్‌ఖీల్, ఒడియన్ స్మిత్ కూడా ఎస్ఏ 2023లో ఎంఐ కెప్టెన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. నోస్తుష్ కెంజిగె ఎంఎల్సీ 2023లో ఎంఐ న్యూయార్క్ జట్టుకు ఆడాడు.
ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ 20 మంది ఆటగాళ్లలో 12 మందిని మాత్రమే రిటైన్ చేసుకుంది. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, ఫజల్లా క్ ఫరూకీ, అండ్రె ఫ్లెచర్, ముహమ్మద్ వాసిమ్, జహూర్ ఖాన్, జోర్డాన్ థాంప్సన్, విలియమ్ స్మీద్, మెక్కెన్నీ క్లార్క్, డేనియల్ మౌస్లే ఉన్నారు. వీళ్లంతా వచ్చే ఏడాది జట్టులో భాగం కాబోతున్నారు.