Yuzvendra Chahal | ‘సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు’.. వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్
Yuzvendra Chahal : ఆసియా కప్(Asia cup 2023)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)కు నిరాశే మిగిలింది. ఐపీఎల్లో, విండీస్ సిరీస్‌లో అదరగొట్టినా 17 మంది బృందంలో చోటు దక్కించుకోలేకపోయాడు. దాంతో, ఈ స్టార్ స్పిన్నర్‌కు వరల్డ్ కప్‌లో ఆడాలన్న తన కల చెదరనుందా? అనే బెంగ పట్టుకుంది. అయితే.. అతను సెలెక్టర్లపై మాటల యుద్దానికి దిగలేదు. సోషల్‌మీడియాలో....
Yuzvendra Chahal : ఆసియా కప్(Asia cup 2023)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)కు నిరాశే మిగిలింది. ఐపీఎల్లో, విండీస్ సిరీస్‌లో అదరగొట్టినా 17 మంది బృందంలో చోటు దక్కించుకోలేకపోయాడు. దాంతో, ఈ స్టార్ స్పిన్నర్‌కు వరల్డ్ కప్(ODI World Cup 2023)లో ఆడాలన్న తన కల చెదరనుందా? అనే బెంగ పట్టుకుంది. అయితే.. అతను సెలెక్టర్లపై మాటల యుద్దానికి దిగలేదు. సోషల్‌మీడియాలో రెండే రెండు ఎమోజీతో తన మనసులోని మాటను వెల్లడించాడు. ఇంతకు ఆ పోస్ట్‌లో ఏముందంటే..? సూర్యుడు మబ్బల చాటున ఉంటాడు. మబ్బు తెర తొలగడంతో రెండో ఎమోజోలో సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ‘సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు’ అనే అర్థం వచ్చేలా ఉన్న పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆసియా కప్ పోటీలకు బీసీసీఐ ఈరోజు 17 మంది స్క్వాడ్‌ను ప్రకటించింది. వరల్డ్ కప్ ముందు భారత జట్టు ఆడుతున్నఈ టోర్నీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆసియా కప్‌లో రాణిస్తే వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కినట్టే. అందుకని యజ్వేంద్ర చాహల్ ఈ కప్‌లో సత్తా చాటాలని అనుకున్నాడు. అయితే.. అతడి బదులు కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ఎంపికయ్యాడు. ఈ విషయంపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర సమాధానం చెప్పాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడంతో చాహల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని అన్నాడు. జట్టులో బ్యాలెన్స్ కోసమే చాహల్‌ను తప్పించామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.
⛅️——> 🌞
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023
ఆసియా కప్ కోసం ముగ్గురు స్పిన్నర్లను సెలెక్ట్ చేశారు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel) ఆల్‌రౌండర్‌గా చోటు సంపాదించగా, కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ఈ టోర్నీతో జట్టులోకి వచ్చారు. దాంతో, టీమిండియా మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. విండీస్ పర్యటనలో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు మరో అవకాశం వచ్చింది.
కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్

ఆసియా కప్‌తో నాలుగో స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అనే దానిపై స్పష్టత రానుంది. ఈ ఏడాది ఆగస్టు 30న ఆసియా కప్ మొదలవ్వనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ ట్రోఫీకి భారత్, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి ట్రోఫీపై కన్నేసిన భారత్ ఆగస్టు 24న బెంగళూరులో శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
Asia Cup 2023 | వరల్డ్ కప్ తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి.. చాహల్‌పై వేటుకు కారణమదే..! : రోహిత్ శర్మ
Wanindu Hasaranga | లంక ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. టాప్ స్కోరర్‌గా శ్రీలంక స్పిన్నర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

