Ambati Rayudu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగిడిన పదిరోజులకే అధికార వైఎస్సార్సీపీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. వైఎస్సార్సీపీ అధిష్టానంతో విభేదాల కారణంగానే రాయుడు ఆ పార్టీని వీడాడని రాజకీయ విశ్లేషకులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వాళ్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వేళ రాయుడు తాను ఎందుకు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాడో స్పష్టం చేశాడు.
వైఎస్సార్సీపీ నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేసిన తర్వాత నేడు రాయుడు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ… ‘అంబటి రాయుడు అను నేను త్వరలో దుబాయ్ వేదికగా జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)లో ముంబై తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా…’ అని ట్వీట్ పెట్టాడు. దుబాయ్ వేదికగా ఈనెల 19 నుంచి ఐఎల్ టీ20 మొదలుకానుంది. ఫిబ్రవరి 17 దాకా ఈ టోర్నీ జరుగుతుంది.
I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport.
— ATR (@RayuduAmbati) January 7, 2024
రాయుడు ఇచ్చిన క్లారిటీపై నెటిజన్లు ‘ఇదంతా ఉత్త ముచ్చట’ అన్నట్టుగానే కామెంట్స్ చేస్తున్నారు. రాయుడిపై కోపంగా ఉన్న కొంతమంది వైఎస్సార్సీపీ అభిమానులు ‘పోతే పోయావు గానీ మళ్లీ ఇటు రాకు’ అని కామెంట్స్ పెడుతుండగా తెలుగు తమ్ముళ్లు ‘త్రీ డీ ప్లేయర్ వైఎస్ జగన్ నీ పొలిటికల్ కెరీర్ను నాశనం చేశాడు..’ అంటూ ట్వీటుతున్నారు. ఇక న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం.. ‘నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు గానీ సరే అలాగే కానియి..’ అని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. 2023 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నాడు.
Alage alageee pic.twitter.com/MaQuCQ9VAX
— Sandhya Reddy YSCRP 🇺🇿 (@SandhyaSamayam) January 7, 2024
.
.
Why do you need to be politically non-affiliated to play IPL or game of cricketకవరింగులాపి ఆట మీద శ్రద్ధ పెట్టండి సార్#HelloAP_ByeByeYCP
జై @JanaSenaParty— మెగాపవర్ సేనాని🧢 (@MegaPowerSenani) January 7, 2024
E mukka ninne chepichu kada Rayudu. E twitt tho nekunna paruvu complete ga poindi. Aadudam Andhra aepoinda ipudu vere keague lo adathava? Comedy ga leda
— Andhra kurrodu (@BatchuKantha) January 7, 2024