బాకు: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పురుషుల 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అమన్ప్రీత్సింగ్ పసిడి పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పోరులో అమన్ప్రీత్సింగ్ 577 పాయింట్లతో టాప్లో నిలువగా, లీ గ్యుయెంక్(574), కెవిన్ చాపన్ వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
మరోవైపు మహిళల 25మీటర్ల పిస్టల్ టీమ్ఈవెంట్లో భారత త్రయం తియాన, యశిత షోకిన్, క్రితికా శర్మ కాంస్య పతకం సొంతం చేసుకుంది. టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఐదు స్వర్ణాలు దక్కించుకుంది.