INDW vs SAW : సొంతగడ్డపై చితకబాదేస్తారనుకుంటే.. స్పిన్నర్లను ఎదుర్కొలేక పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు భారత బ్యాటర్లు. వైజాగ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఎడమచేతి స్పిన్నర్ల ధాటికి ప్రధాన బ్యాటర్లంతా డగౌట్ చేరారు. వికెట్లు పడిన దశలో రీచా ఘోష్ (45 నాటౌట్)కీలక ఇన్నింగ్స్ ఆడుతోంది. అమన్‌జోత్ కౌర్ (13) అండగా స్కోర్‌బోర్డును నడింపించిన రీచా స్కోర్ 150 దాటించింది.
అయితే.. ట్రయాన్ ఓవర్లో అమన్‌జోత్ ఔటయ్యింది. దాంతో.. ఏడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం స్నేహ్ రానా జతగా మరోవిలువైన భాగస్వామ్యంతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అదించే పనిలో ఉంది ఫినిషర్ రీచా. 44 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 190-7.
Another start that didn’t go the distance for Smriti Mandhana 📉
LIVE ▶️ https://t.co/LFct1SLX3V | #CWC25 | #INDvSA pic.twitter.com/9v6sOnoPQk
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2025
వైజాగ్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకుంటున్నారు. స్మృతి మంధాన (23) ప్రతీకా రావల్(37) తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(0) చోలే ట్రయాన్ వేసిన 21వ ఓవర్లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డకౌట్ అయింది. దాంతో.. 92 వద్ద టీమిండియా నాలుగో వికెట్ పడింది. ఆ సమయంలో జట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(9), దీప్తి శర్మ(4)లు కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. మిడిలార్డర్ వైఫల్యంతో కష్టాల్లో పడిన జట్టును గట్టెక్కించే భాద్యత తీసుకుంది రీచా ఘోష్. తన సహజ శైలిని పక్కన పెట్టి.. అమన్‌జోత్ కౌర్(13)తో స్కోర్‌బోర్డును నడిపించింది. వీర్దిదరూ అర్ధ శతకం భాగస్వామ్యంతో కోలుకుంటున్న టీమిండియాను ట్రయాన్ మళ్లీ దెబ్బకొట్టింది. 51 పరుగులు జోడించిన అమన్‌జోత్ వికెట్ తీసి టీమిండియా కష్టాలను మరింతం పెంచిందీ స్పిన్నర్.