అమ్మాన్(జోర్డాన్): ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలుర అండర్-17 63కిలోల తొలి రౌండ్లో భారత యువ బాక్సర్ అమన్ సివాచ్ 4-1తో అబుబకీర్ దుషీవ్(కిర్గిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు.
ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన అమన్..ప్రత్యర్థి బాక్సర్‌పై పదునైన పంచ్‌లతో చెలరేగాడు.