ఇస్తాంబుల్: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన ఫ్రీ స్టయిల్ విభాగంలో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు. ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో అమన్ సెహ్రావత్ (57 కిలోలు).. సెమీస్‌లో 12-2 తేడాతో ఉత్తరకొరియాకు చెందిన చోంగ్సంగ్ హ్యాన్ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాడు.
దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్ పురుషుల కేటగిరీలో భారత్‌కు తొలి బెర్తు ఖాయమైంది. 65 కిలోల విభాగంలో సుజీత్ కల్కల్.. సెమీస్‌లో 1-6తో ఒచిర్ (మంగోలియా) చేతిలో ఓడాడు. దీపక్ పు నియా (86 కిలోలు), సుమిత్ మాలిక్ (125 కిలోలు) తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటిముఖం పట్టగా జైదీప్ అహ్లవత్ (74 కిలోలు) క్వార్టర్స్‌లో పరాభవం పాలయ్యాడు.