మెల్బోర్న్ : ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సారథి అలిస్సా హీలి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. త్వరలో సొంతగడ్డపై భారత్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌ల తర్వాత క్రికెట్ నుంచి వైదొలుగనున్నట్టు ఆమె తెలిపింది. 15 ఏండ్ల నుంచి ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న 35 ఏండ్ల హీలి.. ఆ జట్టు గెలిచిన 8 ప్రపంచకప్‌లలో భాగస్వామిగా ఉంది.
మూడు ఫార్మాట్లలో కలిసి సుమారు 300 మ్యాచ్‌లు ఆడి 7 వేలకు పైగా పరుగులు సాధించింది. 2023లో మెగ్ లానింగ్ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న ఆమె.. జట్టును విజయపథంలో నడిపించినా కీలక టోర్నీల్లో ఆసీస్ తడబాటుకు గురైంది.