హైదరాబాద్, ఆట ప్రతినిధి : గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండు వేల మంది పిల్లలతో అలెన్ వరల్డ్ జూనియర్ రన్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు నగరంలోని దాదాపు 180 పాఠశాలల నుంచి రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. స్పాట్ ఆన్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన ఈ రనన్‌ను భారత యువ అథ్లెట్ అగసర నందిని జెండా ఊపి ప్రారంభించింది.
గచ్చిబౌలిలో మొదలైన పరుగు టిమ్స్ గేటు నుంచి గోపీచంద్ అకాడమీ, ఐఎస్బీ సర్కిల్ మీదుగా తిరిగి స్టేడియంలోకి ప్రవేశించింది. 1కే రన్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 1కే, 3కే, 5కే, 10కే విభాగాల్లో కలిపి 84 మంది ప్లేయర్లు 3 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పాట్ ఆన్ స్పోర్ట్స్ సీఈవో రోహిత్మిశ్రా పాల్గొన్నారు.