బ్రిస్టల్: ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన రెండో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత జెమీమా రోడ్రిగ్స్ (41 బంతుల్లో 63, 9ఫోర్లు, 1 సిక్స్), అమన్జ్యోత్కౌర్ (40 బంతుల్లో 63 నాటౌట్, 9ఫోర్లు) అర్ధసెంచరీలతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది.
31 పరుగులకే షెఫాలీవర్మ(3), మందన(13), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(1) వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోడ్రిగ్స్, అమన్జ్యోత్కౌర్ ఆదుకున్నారు. టీ20ల్లో తొలి అర్ధసెంచరీ సాధించిన అమన్జ్యోత్కు ఆఖర్లో రీచా ఘోష్(32 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోరు అందుకుంది.
లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 20 ఓవర్లలో 157/7కే పరిమితమైంది. తెలుగమ్మాయి శ్రీచరణి (2/28)కు తోడు దీప్తి, అమన్‌జ్యోత్ ఒక్కో వికెట్‌తో రాణించడంతో ఇంగ్లండ్ ఓటమివైపు నిలిచింది. దీనికి తోడు మూడు రనౌట్లు ఇంగ్లండ్ కొంపముంచాయి. అమన్జ్యోత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.