హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువ బాక్సర్ అనుముల సాయి భార్గవ్‌రెడ్డి మరోమారు సత్తాచాటాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఆల్ఇండియా జూనియర్స్ సీఎం కప్ బాక్సింగ్ టోర్నీలో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన భార్గవ్‌రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. పోటీలకు ఆఖరి రోజైన బుధవారం జరిగిన పురుషుల విభాగంలో భార్గవ్.. హర్యానా బాక్సర్‌పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన ఈ ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి విజేతగా నిలిచాడు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భార్గవ్‌రెడ్డిని కోచ్‌తో పాటు గ్రామస్థులు అభినందించారు.