అడిలైడ్: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106, 8 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో మెరిశాడు. అతడికి తోడు ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (82) రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 326 రన్స్ చేసింది.
టాపార్డర్ విఫలమైనప్పటికీ ఖవాజా, లోకల్ బాయ్ కేరీ కంగారూలకు మెరుగైన స్కోరునందించారు. మిచెల్ స్టార్క్ (33*) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లిష్ పేసర్లలో జోఫ్రా ఆర్చర్ (3/29), బ్రైడన్ కార్స్ (2/70) రాణించారు.