US Open : పురుషుల టెన్నిస్‌లో యువకెరటాలు కార్లోస్ అల్కరాజ్(Carlos Alacarz), జన్నిక్ సిన్నర్ (Jannik Sinner) జోరు చూపిస్తున్నారు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ఇరువురు మరో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నారు. ఇదివరకే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్ పోరులోతలపడిన ఈ కుర్రాళ్లు.. ఇప్పుడు యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దాంతో.. ఒకే సీజన్లో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లుగా సరికొత్త చరిత్ర లిఖించారీ యంగ్ గన్స్. తద్వారా రోజర్ ఫెదరర్(Roger Federer), రఫెల్ నాదల్(Rafael Nadal) వంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని రికార్డు నెలకొల్పారీ టాప్ సీడ్స్.
అమెరికా వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో ఆద్యంతం అదరగొట్టిన సిన్నర్, అల్కరాజ్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచారు. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఫెలిక్స్ అగర్ అలియస్మిమెను చిత్తు చేశాడు ఇటలీ స్టార్. పొత్తి కడుపులో నొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలో బ్రేక్ తీసుకున్న సిన్నర్ 6-1, 3-6, 6-3, 6-4తో ఫెలిక్స్ ఆట కట్టించాడు. రెండో సెమీస్‌లో నొవాక్ జకోవిచ్‌కు చెక్ పెట్టిన అల్కరాజ్ మూడేళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టాడు.
Carlos Alcaraz enters a tournament.
Carlos Alcaraz reaches the final.For the eighth time in a row. pic.twitter.com/PbkWpjhIbu
— US Open Tennis (@usopen) September 5, 2025
ఈసారి 25వ గ్రాండ్‌స్లామ్ కొల్లగొట్టాలనుకున్న జకో కలను చెదరగొడుతూ ఇంటికి పంపించాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ పట్టువదలని ఈ రెండో సీడ్ 6-4, 7-6(4), 6-2తో జోకర్ కథ ముగించాడు. ఫైనల్ చేరడంతో మూడోసారి సిన్నర్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడీ స్పెయిన్ కుర్రాడు. ఈ ఇద్దరి కంటే ముందు 2012లో జకోవిచ్, నాదల్ మాత్రమే వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడారు.
Novak Djokovic vs Rafa Nadal vs Roger Federer – a complete career comparison:
Slams:
🇷🇸Djokovic: 24 ✅
🇪🇸Nadal: 22
🇨🇭Federer: 20ATP Finals:
🇷🇸Djokovic: 7 ✅
🇨🇭Federer: 6
🇪🇸Nadal: 0Masters:
🇷🇸Djokovic: 40 ✅
🇪🇸Nadal: 36
🇨🇭Federer: 28Olympics (singles):
🇷🇸Djokovic: Gold +… pic.twitter.com/OIsGuB6WRD— Danny (@DjokovicFan_) July 12, 2025